ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజవర్గంలో మరోసారి టీడీపీ-బీజేపీ నాయకులు, కార్యక ర్తల మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. ఒకరిపై ఒకరు నాయకులు దాడులు చేసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ యువ నాయకుడు పరిటాల శ్రీరాం.. తాజా పరిణామాలపై తన కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా పార్టీని పరిరక్షించుకు నేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు.