AP: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్ తగలనుంది. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారం ప్రజలపై పడనుంది. 2022-23లో విద్యుత్ కొనుగోలు భారాన్ని వచ్చే నెల నుంచి వసూలు చేసేలా డిస్కంలకు ఈఆర్‌సీ అనుమతి ఇచ్చింది. దాదాపు రూ.6,072.86 కోట్లను ప్రజలే భరించాల్సి ఉంటుంది. యూనిట్‌కు రూ.1.21 చొప్పున 12 నెలల పాటు వసూలు చేస్తారు. ఇప్పటివరకు యూనిట్‌కు రూ.1.05 చెల్లించిన ప్రజలు.. తాజా భారంతో కలిపి యూనిట్‌కు రూ.2.26 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.