మాజీ ఎంపీకి బిగ్ షాక్‌

55చూసినవారు
మాజీ ఎంపీకి బిగ్ షాక్‌
మాజీ ఎంపీ నందిగం సురేశ్‌తో పాటు దేవినేని అవినాశ్, అప్పిరెడ్డి సహా పలువురు వైసీపీ నేతలకు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతల అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. తాము సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు 2 వారాలు పాటు తమకు అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఆదేశాలివ్వాలంటూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ కేసులో బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేసిన నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు కుదరదని హైకోర్టు సూచించింది.

సంబంధిత పోస్ట్