AP: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కూతురు నేహా రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. జీవీఎంసీ అధికారులు అక్రమంగా నిర్మించిన నిర్మాణంపై పూర్తి రిపోర్టును హైకోర్టుకు సమర్పించనున్నట్లు సమాచారం. భీమిలిపట్నం పరిధిలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్‌లో నేహారెడ్డి నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిన కారణంగా జనసేన నాయకులు గతంలో ఆమెపై ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన జీవీఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలను ఇటీవల కూల్చివేశారు.