ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచింది. గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్ లో ఉన్న కొత్త రేషన్ కార్డుల మంజూరుపై అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. కొత్తగా వివాహం చేసుకున్న జంటలతో పాటుగా ప్రభుత్వ నిర్దేశిత మార్గదర్శకాలను అనుగుణంగా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ సమావేశాల తర్వాత కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు సమాచారం.