AP: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్.. డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు కార్తీక్, తరుణ్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.