AP: ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైక్ చోరీ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ప్రత్తిపాడు మండలం యనమదల గ్రామంలో గత కొంతకాలంగా కొట్లాటలు, చోరీలు, పేకాట జోరుగా కొనసాగుతుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగుడు ఓ బైక్‌ను ఎత్తుకెళ్లాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.