AP: బర్డ్ ఫ్లూ కారణంగా రాష్ట్రంలో లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. రోజురోజుకూ కోళ్ల మరణాల సంఖ్య పెరుగుతోంది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చికెన్ అమ్మకాలపై పడినట్లు తెలిసింది. ప్రజలు చికెన్ తినాలంటేనే భయపడిపోతున్నారు. అమ్మకాలు లేకపోవడంతో చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. ప్రజలు మటన్, చేపలు, రొయ్యల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటి ధర కిలోపై రూ.100 పెరిగాయి. కాగా, కేజీ చికెన్ ధర రూ.150-180కి పడిపోయింది.