తిరంగా ర్యాలీ.. చంద్రబాబు, పవన్‌కు బీజేపీ ఆహ్వానం

53చూసినవారు
తిరంగా ర్యాలీ.. చంద్రబాబు, పవన్‌కు బీజేపీ ఆహ్వానం
AP: విజయవాడలో రేపు తిరంగా యాత్ర నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో పాల్గొనాలని సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి ఆహ్వానించారు. శుక్రవారం సాయంత్రం ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో బీజేపీ ఈ నెల 13 నుంచి దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కూటమి నేతలంతా యాత్రలో పాల్గొంటారని పురందీశ్వరి తెలిపారు.

ట్యాగ్స్ :