ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. అనంతరం ఆయనకు బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. విజయం సాధించిన వేళ మోదీని గజమాలతో పార్టీ ఎంపీలు తదితరులు సత్కరించారు. కాసెపట్లో మోదీ విజయోత్సవ ప్రసంగం చేయనున్నారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా తదితరులు హాజరయ్యారు.