ఆమ్‌ఆద్మీ పార్టీని చీల్చేందుకు బీజీపీ విస్తృత ప్రయత్నాలు చేస్తోందని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.15కోట్లు చొప్పున ఆఫర్ చేశారని.. ఇప్పటివరకు ఏడుగురిని సంప్రదించారని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన కొన్ని గంటలకే ఆప్ నేత ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. కాగా, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెల్లడి కానున్నాయి.