ఢిల్లీ అసె
ంబ్లీ ఎన్నికల్లో
బీజేపీ విజయం సాధిం
చడంతో ఇటు ఏపీలోనూ సంబరాలు మొదలయ్యాయి. విజయవాడలోని
బీజేపీ కార్యాలయం వద్ద జరిగిన ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని
బీజేపీ కైవసం చేసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాణసంచా
కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. పార్టీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.