AP: బాపట్ల జిల్లా పర్చూరు మండలం అడుసుమల్లిలో విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన పదో తరగతి విద్యార్థి సందీప్ మృతదేహం కాలువలో లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన భయాందోళనకు గురి చేస్తుంది. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.