AP: రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఉడికించిన గుడ్లు, చికెన్ తింటే ఎలాంటి ప్రమాదం లేదన్నారు. బర్డ్ ఫ్లూపై సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేసి.. భయాందోళనలు సృష్టిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం, శాస్త్రవేత్తలతో చర్చించామని, వైరస్ వ్యాప్తి కి.మీ. పరిధిలోపే ఉంటుందని చెప్పినట్లు ఆయన వెల్లడించారు.