AP: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పుస్తక మహోత్సవం కార్యక్రమాన్ని నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్నిచ్చింది పుస్తకాలేనని అన్నారు. తన తల్లిదండ్రుల వల్ల పుస్తక పఠనం అలవాటైందని తెలిపారు. 'రూ.కోటి ఇవ్వడానికి ఆలోచించను కానీ.. పుస్తకం ఇచ్చేందుకు ఆలోచిస్తా. పుస్తకం ఇవ్వాలంటే నా సంపద ఇచ్చినంత మథనపడతా' అని పవన్ కళ్యాణ్ అన్నారు.