స్కూల్స్ రీఓపెన్ అయిన రోజే పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేశామని మంత్రి లోకేశ్ చెప్పారు. మిగిలిన పాఠశాలలకు ఈ నెల 20లోగా అందజేస్తామని వెల్లడించారు. వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని 9600 పాఠశాలలకు విస్తరించామని తెలిపారు. అన్ని స్కూల్స్‌కు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు చెప్పారు. మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం పంపేందుకు నాదెండ్లతో చర్చించి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.