AP: శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆరో తరగతి విద్యార్థి యువంత్ తను చనిపోయినా అవయవదానంతో 5 కుటుంబాల్లో వెలుగు నింపాడు. సంతబొమ్మాళి మండలానికి చెందిన యువంత్ జనవరి 29న పుట్టినరోజు జరుపుకున్నాడు. తర్వాతి రోజే కళ్లు తిరిగిపడిపోవడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలుడికి అరుదైన వ్యాధి వచ్చిందని వైద్యులు తెలిపారు. సోమవారం అతడు చనిపోవడంతో కళ్లు, లివర్, కిడ్నీలను వైద్యులు సేకరించారు.