AP: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వంలోని ఇతర శాఖల్లో చోటు కల్పించి, వారికి జాబ్ చార్టుతోపాటు, ప్రమోషన్ కు అవకాశం కల్పించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఇందులో భాగంగా డిజిటల్ అసిస్టెంట్లను ప్రణాళికశాఖలో మండలస్థాయిలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల్లో భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు గతంలో నియమించిన కమిటీని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం జీవో ఇచ్చింది.