బీహార్ లోని ఖగారియా జిల్లాలోతాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. గంగా నదిపై అగువాని సుల్తాన్‌గంజ్ గంగా పేరుతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్‌లో ఓ భాగం ఒక్కసారిగా గంగానదిలో కూలిపోయింది. దీని నిర్మాణం కోసం బిహార్ ప్రభుత్వం రూ.1,717 కోట్లు కేటాయించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.