కాంగ్రెస్ పార్టీలోనే BRS విలీనం అవుతుందని బండి సంజయ్ జోస్యం చెప్పారు. బీజేపీలో BRS విలీనం అవుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కేసీఆర్‌కు AICCలో పదవి, కేటీఆర్‌కు PCC చీఫ్, కవితకు రాజ్యసభ సీటు రావడం ఖాయమన్నారు. బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తే కవితకు బెయిల్ వస్తుందనడం మూర్ఖత్వమన్నారు. కాళేశ్వరం, డ్రగ్స్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్‌లను రేవంత్ ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.