TG: ఏడేళ్ల చిన్నారిపై బస్సు డ్రైవర్ లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులను ఈ నెల 4న విహారయాత్రకు తీసుకెళ్లారు. అయితే అక్కడ ఒకటో తరగతి చదువుతున్న బాలికను బస్సు డ్రైవర్ జోసఫ్ రెడ్డి (40) టాయిలెట్‌కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి విషయం తల్లిదండ్రులకు చెప్పగా వారు మంచాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.