భవన నిర్మాణాలకు 24 గంటల్లోనే అనుమతులు

69చూసినవారు
భవన నిర్మాణాలకు 24 గంటల్లోనే అనుమతులు
AP: భవన నిర్మాణ అనుమతుల కోసం కార్పొరేషన్లు, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ఇక బిల్డర్లు తిరగాల్సిన పని లేదు. సమీపంలోని లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్ (ఎల్‌టీపీ, లైసెన్స్‌డ్ సర్వేయర్) ద్వారా భవన నిర్మాణానికి దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే అనుమతులు పొందవచ్చు. నిబంధనలకు లోబడి పనులు పూర్తి చేసి ఆక్సుపెన్సీ సర్టిఫికెట్ కూడా పొందవచ్చు. కాగా, భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యాన్ని నిరోధిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్