టెస్టుల్లో బ్యాటింగ్, బౌలింగ్ ర్యాంకులను ఐసీసీ తాజాగా అప్‌డేట్ చేసింది. బౌలింగ్ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా 908 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. టాప్ -10లో జడ్డూ (745) తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచాడు. ఇక బ్యాటర్ల విషయానికొస్తే.. ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ (895) అగ్రస్థానంలో ఉన్నాడు. టాప్ -10లో కేవలం ఇద్దరు భారత బ్యాటర్లు మాత్రమే ఉన్నారు. యశస్వి జైస్వాల్ (847) నాలుగో ప్లేస్, రిషభ్ పంత్ (739) తొమ్మిదో స్థానంలో నిలిచాడు.