AP: రాష్ట్రవ్యాప్తంగా HD బర్లీ పొగాకు కొనుగోళ్లు జరుగుతున్నాయని మార్కెఫెడ్ ఎండీ ఢిల్లీరావు తెలిపారు. ఇంకొల్లు, పంగులూరు, పర్చూరు, బీకేపాలెం, చీరాల, గుంటూరు, పెదకాకాని, చిలకలూరిపేట, ఎడ్లపాడు, గుండ్లపల్లి కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయని చెప్పారు. రూ 17.20 కోట్ల విలువైన 2245 బేళ్ల పొగాకు విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు. రైతులకు డిజిటల్ చెల్లింపులు చేస్తున్నట్లు ఆయన వివరించారు.