AP: పత్రికా కార్యాలయాలపై దాడులు చేసే సంస్కృతి ప్రమాదకరమని వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆందోళన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. `ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయాన్ని తగలబెట్టడం అత్యంత దారుణం. సాక్షి కార్యాలయాలపై దాడులు సరికాదు. కొమ్మినేనిపై పెట్టినట్టు వారందరిపైనా అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు పంపుతారా` అని నాగార్జున ప్రశ్నించారు.