కోయంబత్తూరులో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి 20 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో 40 మంది గాయపడ్డారు. వారిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉంది. తిరుప్పూర్ నుండి వాల్పరై వెళ్తున్న బస్సు ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మలుపు తిప్పుతుండగా నియంత్రణ కోల్పోయి లోయలో బోల్తా పడింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.