AP: రాష్ట్ర ప్రభుత్వం వాట్సప్ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాట్సప్‌లో ఆర్టీసీ బస్సు టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
టికెట్ బుకింగ్ ఇలా..
- 95523 00009 నంబర్‌కు ‘HI’ అని మెసేజ్ పంపాలి.
- ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయో చూపిస్తుంది.
- అందులో ఆర్టీసీ టికెట్ బుకింగ్/రద్దు ఆప్షన్‌ను ఎంపిక చేయాలి.
- మీ ప్రయాణ వివరాలు నమోదు చేసి ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయాలి.
- బస్సు టికెట్ వాట్సప్ నంబర్‌కు వస్తుంది.