సముద్రంలో దూకబోయిన మహిళను.. హీరోలా కాపాడిన క్యాబ్ డ్రైవర్ (వీడియో)

527చూసినవారు
మహారాష్ట్రలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ముంబయిలోని నిత్యం రద్దీగా ఉండే అటల్‌ సేతు బ్రిడ్జిపై ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. అయితే అక్కడే ఉన్న క్యాబ్‌ డ్రైవర్ మహిళ దూకుతుండగా హీరోలా చేయి పట్టుకుని కాపాడాడు. వెంటనే పోలీసులు కూడా రావడంతో ఆమె ప్రాణాలును సురక్షితంగా కాపాడారు. ఆ మహిళ ములుంద్‌ ప్రాంతానికి చెందిన రీమా ముకేశ్‌ (56)గా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

సంబంధిత పోస్ట్