TG: సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ అధ్వర్యంలోని సబ్ కమిటీ ఇచ్చిన కులగణన నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఏకసభ్య కమిషన్ అందజేసిన ఎస్సీ వర్గీకరణ నివేదికను ఆమోదించింది. ఈ రెండు నివేదికలపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చర్చించనున్నారు. కులగణనపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. మ.2 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం కానుంది.