AP: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న అరసవల్లి దర్శనంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ తనతో పాటు సింగర్ మంగ్లీ కనిపించారు. దాంతో ఆయనపై తెలుగు తమ్ముళ్లు నెట్టింట విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీకి ప్రచారం చేసిన మంగ్లీని ఆలయానికి ఎలా తీసుకెళ్లారంటూ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు పేరు పలకనన్న మంగ్లీ ఇప్పుడు వీఐపీ అయ్యిందని, పార్టీ కోసం 40 ఏళ్లుగా కష్టపడిన వారు వీఐపీలు కాలేకపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.