AP: వేసవి ముగిసేలోగా కాలువ పూడికతీత, మమరమ్మతులు పూర్తిచేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. శనివారం బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవి పర్యటించారు. బల్లికురవలోని ఈర్ల గంగమ్మ గుడిలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాగునీటి సంఘాల కమిటీ సభ్యులతో మాట్లాడి మంత్రి దిశానిర్దేశం చేశారు. పంటకాలువలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.