AP: అర్హత లేని వారికి పింఛన్లు రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అనర్హులుగా గుర్తించిన వారికి తొలుత నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. లబ్ధిదారుల పరిస్థితిని బట్టి పింఛన్లు కొనసాగించాలని, అర్హత నిరూపించకపోతే రద్దు చేయాలని సూచించింది. నోటీసులకు స్పందించని వారి పింఛన్లను హోల్డ్‌లో పెట్టాలని ఆదేశించింది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 3.5 లక్షల మంది అనర్హులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.