ఏపీ ప్రజలకు హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ తీపికబురు చెప్పారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా మరిన్ని సేవలు చేస్తానని బాలకృష్ణ తెలిపారు. ఇందులో భాగంగా అమరావతిలోని తుళ్లూరులో త్వరలో ఆస్పత్రి ప్రారంభిస్తామని చెప్పారు. హైదరాబాద్ క్యాన్సర్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ ఆంకాలజీ యూనిట్ ప్రారంభం అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. పేదలకు అందుబాటు ధరల్లోనే క్యాన్సర్‌కు చికిత్స అందిస్తామని ఆయన పేర్కొన్నారు.