ఢిల్లీ అధికార పీఠం ఎవరికి దక్కుతుందో మరికొన్ని నిమిషాల్లో తేలిపోనుంది. హస్తిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడి కానున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ క్రమంలో అభ్యర్థులు దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు మొదలు పెట్టారు. జంగ్పురా స్థానం నుండి పోటీ చేసిన ఆప్ అభ్యర్థి మనీష్ సిసోడియా స్వామి నారాయణ్ ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు.