సాక్షి కార్యాలయం బోర్డు పీకేసిన రాజధాని రైతులు

73చూసినవారు
సాక్షి కార్యాలయం బోర్డు పీకేసిన రాజధాని రైతులు
AP: గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సాక్షి కార్యాలయం వద్ద రాజధాని మహిళలు, రైతులు ఆందోళనకు దిగారు. జగన్‌కు, సాక్షి టీవీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ మేరకు సాక్షి బోర్డును తొలగించి మురుగు కాలువలో పడేశారు. సాక్షి పత్రికలను తగలబెట్టారు. భారతీ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షి కార్యాలయం గేటు దూకేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్