ఉత్తర సిరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం మన్బిజ్ నగర శివార్లలో వ్యవసాయ కార్మికులను తీసుకెళ్తున్న వాహనం సమీపంలో నిలిపి ఉంచిన కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం 19 మంది మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలా మంది మహిళలు ఉండగా, కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పేలుడు స్థలంలో రక్తంతో తడిసిన మృతదేహాలు రోడ్డుపై పడిపోయాయి. పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది.