లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

52చూసినవారు
లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి
AP: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన కారు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్