AP: కాకినాడ జిల్లా తుని వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారు రాజమహేంద్రవరం అపోలో ఫార్మసీ ఉద్యోగులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.