ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై కాలేజీ యువతులు, యువకులు నడుస్తున్నారు. ఇంతలోనే ఓ కారు భారీ వేగంతో ప్రమాదవశాత్తు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సమీప ఆసుపత్రికి తరలించారు. ఓ అమ్మాయి బానెట్ మీద ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.