మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు

57చూసినవారు
మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు
AP: మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అటవీశాఖ అధికారులు ఈ నెల 6న కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలో ఉన్న అటవీ భూమిలోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు స్థలాన్ని ఆక్రమించి, జీవ వైవిధ్యానికి నష్టం కలిగించారని ప్రాథమిక నేర నివేదికలో అధికారులు పేర్కొన్నారు. పెద్ది రెడ్డి, అతని కుటుంబ సభ్యులు 27.98 ఎకరాలను కబ్జా చేసినట్లు తేలింది.

సంబంధిత పోస్ట్