మెక్సికోలోని ఓ పాఠశాల పునాది వద్ద పాత శ్మశానవాటిక బయటపడింది. పునరుద్ధరణ పనుల సందర్భంగా తవ్వకాలు చేస్తుండగా విద్యార్థుల సమక్షంలో అస్థిపంజరాలు, పుర్రెలు లాంటి అవశేషాలు వెలుగు చూశాయి. ఈ ఘటన విద్యార్థుల్లో భయాందోళనలు కలిగించింది. 80 చదరపు సెం.మీ. విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలంలో 8 మంది చిన్నారులు, ఒక యువకుడికి చెందిన ఎముకలు గుర్తించారు. అధికారులు ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.