ప్రభుత్వ విభాగాల్లో వాడే కంప్యూటర్లు, డివైజ్‌లలో చాట్‌జీపీటీ, డీప్‌సీక్ యాప్స్ లాంటి ఏఐ టూల్స్ ఉపయోగించకూడదని కేంద్రం ప్రభుత్వం సూచించింది. కీలకమైన గవర్నమెంట్ డేటా, డాక్యుమెంట్స్ చేతులు మారే రిస్క్ ఉండే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే గతేడాదిలో చాట్‌జీపీటీ ఉపయోగించే వారి సంఖ్య భారత్‌లో మూడు రెట్లు పెరిగిందని తాజాగా ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ వెల్లడించారు.