భారత్‌లో సేవలందిస్తోన్న ఈ-కామర్స్ వేదికలు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (CCPA) భారీ షాకిచ్చింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సహా వివిధ సంస్థలు పాకిస్తాన్ కు చెందిన జెండాలను, ఆ దేశానికి చెందిన వస్తువులను ఆన్లైన్లో అమ్ముతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో జాతీయ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. వెంటనే వాటి ఉత్పత్తుల్ని ప్లాట్ ఫామ్ ల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.