AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోయేది లేదని.. ప్లాంట్‌ను పునర్‌నిర్మిస్తామని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి తెలిపారు. స్టీల్ ప్లాంట్‌ను లాభాల బాటలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు, అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో కుమారస్వామి భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పందించారు.