ఏపీ అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుంది: తంబిదురై

68చూసినవారు
ఏపీ అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుంది: తంబిదురై
AP: రాష్ట్ర అభివృధ్ధికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాజ్యసభ అధ్యయన కమిటీ ఛైర్మన్‌ తంబిదురై అన్నారు. తిరుపతిలోని తాజ్‌ హోటల్లో జాతీయ రహదారులు, పౌరవిమానయాన, ఆర్థిక, పెట్టుబడుల శాఖలకు సంబంధించిన అంశాలపై రాజ్యసభ అధ్యయన కమిటీ సమీక్షించింది. ఏపీకి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల విడుదల తదితర అంశాలను రాజ్యసభ చైర్మన్‌కు నివేదించి త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తామని తంబిదురై అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్