AP: ఏర్పేడు వద్దనున్న కేంద్రీయ విద్యా సంస్థ తిరుపతి IITకి కేంద్ర ప్రభుత్వం రూ.2,300 కోట్లు మంజూరు చేసినట్లు IIT డైరెక్టర్ సత్యనారాయణ బుధవారం తెలిపారు. ఈ నిధులతో IIT ప్రాంగణంలో పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. IITని మరింత అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను మంజూరు చేసిందని ఆయన వివరించారు.