ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. పాకిస్తాన్ ఛాంపియన్ ట్రోఫీకి వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీ థీమ్ సాంగ్‌ను తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ పాటను పాకిస్తాన్ గాయకుడు అతిఫ్ అస్లాం పాడగా.. అబ్దుల్లా సిద్ధిఖీ రూపొందించాడు. అయితే ఈ పాటను పాకిస్తాన్ స్టేడియం, వీధుల్లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్‌గా మారింది.