AP: మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్న మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. మిర్చి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మార్కెట్ జోక్యం ద్వారా తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని కోరారు. సాగు వ్యయం, విక్రయ ధర మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలన్నారు. 50 శాతం నిష్పత్తిలో కాకుండా వందశాతం నష్టాన్ని కేంద్రం భరించాలని లేఖలో పేర్కొన్నారు.