ఏపీలో అమరావతి రాజధాని రైతులకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు వచ్చే ఐదేళ్ల పాటు మేలు చేసే మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వారికి భారీ ఊరట లభించింది.అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతులు దాదాపు 36 వేల మూడు పంటలు పండే భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చారు. ఇప్పటివరకూ ఏటా ఇస్తున్న కౌలును అంతే మొత్తం వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం జరిగే సీఆర్డీయే భేటీలో నిర్ణయం ప్రకటిస్తారు.