మరో పథకానికి చంద్రబాబు శ్రీకారం!

79చూసినవారు
మరో పథకానికి చంద్రబాబు శ్రీకారం!
మరో హామీకి సంబంధించి చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరో పథకానికి సంబంధించి కీలకఆదేశాలను కూడా జారీ చేసింది. దీంతో ఏపీలోని విద్యార్థులకు శుభవార్త చెప్పినట్టు అయ్యింది. ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు తల్లికి వందనం పేరుతో ఏడాదికి 15,000 రూపాయల సహాయం అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అమ్మకు వందనం, స్టూడెంట్ కిట్ పథకాలకు ఆధార్ తప్పనిసరని, లేనిపక్షంలో ఆధార్ కోసం నమోదు చేసుకుని ఉండాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.